Oct 01,2022 16:36
  • కె.వి.కె కోఆర్డినేటర్ జోత్స్న

ప్రజాశక్తి-కలికిరి : పంటలో తెగుళ్లను నివారిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని కె.వి.కె కలికిరి కోఆర్డినేటర్ జోత్స్న రైతులకు సూచించారు. జిల్లాలో అధికంగా  పండిస్తున్న టమోటో పంటలో ప్రస్తుత దశలో ఆకు మాడు తెగులు మరియు వడ తెగులు గమనించడం జరిగిందన్నారు. ఆకు మాడు తెగులు జూలై - డిసెంబర్ మాసాల్లో ఉధృతంగా వస్తుందని, ఈ తెగులు లక్షణాలు ఆకులు తుది భాగంలో గోధుమరంగు వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోతాయని, కాయలు మరియు కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయని, ఆకుల మీద గోధుమ వర్ణపు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడి ఆకులు ఎండిపోయి మొక్కలు తగలబడిపోతున్నట్లు కనిపిస్తాయని తెలిపారు. ఈ తెగుళ్ల నివారణకు క్లోరోథలోని రెండు గ్రాములు లేదా టేబుకొనజోల్ ట్రైప్టోక్సిస్ట్రోబులిన్ 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. అలాగే కొన్ని చోట్ల వడలు తెగులు ఆశిస్తున్నదని ఈ తెగులు యొక్క లక్షణాలు మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకుమారి తొడిమతో సహా రాలి తర్వాత మొక్క వడలిపోయి చనిపోతుందని, ఈ తెగుళ్ల నివారణకు గాను కాపర్ ఆక్సీక్లోరైడ్ 600 గ్రాములు మరియు 24 గ్రాముల స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.