Mar 25,2023 22:51

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ రవీంద్ర



ప్రజాశక్తి - కాకినాడ
2022- 2023వ రెండో అర్థ సంవత్సరం సంబంధించి ది. కాకినాడ కోపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మహాజన సభ జరిగింది. ఈ బ్యాంకు గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 35.19కోట్లు గ్రాస్‌ ప్రాఫిట్‌ అర్జించగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దాదాపు రూ.42 కోట్ల లాభం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కాకినాడ టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చిట్టూరి రవీంద్ర తెలిపారు. శనివారం కాకినాడ నగరంలోని యూనివర్సల్‌ కమ్యూనిటీ హాలులో టౌన్‌ బ్యాంక్‌ రెండవ అర్థ సంవత్సరానికి సంబంధించి మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఒ చెల్లుబోయిన సుగుణ రావు సభ్యులకు బ్యాంకు ఆర్థిక వివరాలను ఆయన వివరించారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ నాటికి 1010 కోట్లు డిపాజిట్లు ఉండగా, 657 కోట్ల రుణాలను ఇచ్చామని మొత్తం 1667. 16కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు చెప్పారు. అలాగే బ్యాంకు పనితీరు, ఇతర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్‌ రవీంద్ర సమాధానాలు ఇచ్చారు. బ్యాంక్‌ డిపాజిట్‌ దారులకు ఇతర జాతీయ బ్యాంకుల వలె ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని, అలాగే బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ కోసం ఆరుగురు సభ్యులతో బ్యాంకులో ఏర్పాటు చేసి ఆమోదం కోసం రిజర్వ్‌ బ్యాంకుకు పంపినట్లు చెప్పారు. 15 శాతం డివిడెంట్‌ ను ప్రకటించామని తీసుకోనివారు బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలని రవీంద్ర కోరారు. మహాజన సభలో టౌన్‌ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు తోట మెహర్‌ సీతారామ సుధీర్‌. డైరెక్టర్లు నున్న నరసింహారావు, మదాని హుస్సేన్‌ మోహిద్దీన్‌ ఖాన్‌, గొల్లపూడి కష్ణమూర్తి, గారపాటి అచ్యుత కళ్యాణ్‌ ప్రసాద్‌, కంటిపూడి వివి సత్యనారాయణ, వల్లూరి శ్రీ నారాయణ ప్రసాద్‌ చౌదరి, డాక్టర్‌ పానుగంటి శ్రీనివాస్‌ ఠాగూర్‌, సత్తి రామారెడ్డి, రిమ్మలపూడి ధర్మేంద్ర, బొల్లిన కష్ణ స్వరూప్‌, ఎండి సుధీర్‌ కుమార్‌, అయ్యగారి వెంకటేష్‌, ఆయా శాఖల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.