May 14,2022 10:02

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌ (అనంతపురం) : అగి ఉన్న లారీని ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి కిందపడి డ్రైవర్‌ ఆనంద్‌ (47) మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని సజ్జల దీన్నే గ్రామం వద్ద చోటుచేసుకుంది. శనివారం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆచి మసాలా కంపెనీకి చెందిన లారీ డ్రైవర్‌ సజ్జల దీన్నే వద్ద లారీని ఆపి టైర్‌ లను చెక్‌ చేసి మళ్లీ లారీని ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి లారీ పైనుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమయ్యిందని తెలిపారు. ఈ క్రమంలో డ్రైవర్‌ తల నుంచి తీవ్రంగా రక్త స్రావం కావడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.