
ప్రజాశక్తి-రామచంద్రపురం రామచంద్రపురంలో క్వారీ లారీ వర్కర్స్ చేసిన సమ్మె విజయవంతం అయిందనీ సిఐటియు నాయకులు నూకల బలరాం తెలిపారు. వర్కర్స్ డిమాండ్స్‌పై యాజమాన్యంతో చర్చలు జరిపారు. 24 గంటల డ్యూటీకి నెలకి జీతం రూ.10 వేలు నుంచి రూ.11 వేలకు పెంచారు. బేటా రూ.600 నుండి రూ.700కు పెంచేందుకు, ట్రిప్పు బేటాలు రూ.50 పెంచే విధంగా, ఆప్టింగ్ డ్రైవర్‌కు పర్మిట్ డ్రైవర్ జీతం కట్టే విధంగా, క్లీనర్ జీతం రూ.900 నుండి రూ.1000కి పెంచేందుకు జీతంతో కూడిన ఒకరోజు సెలవు ఇచ్చే విధంగా యాజమాన్యం అంగీకరించింది. ఈ ఒప్పందంతో సమ్మెను విరమించినట్టు బలరాం వివరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధ్యక్షడు సతీష్, ఉపాధ్యక్షుడు గుబ్బల శంకర్, చౌదరి, సెక్రటరీస్ రాజు, దొరబాబు, కోశాధికారి షారుక్, నాయకులు శ్రీను,నాని, అజరు తదితర వర్కర్స్ పాల్గొన్నారు.