Jul 29,2021 07:52

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పలు సంక్షేమ పథకాల కింద పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారుల సంఖ్య కొద్ది కాలంలో గణనీయంగా తగ్గనురదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నిబంధనల సాకుతో రెరడేళ్లలో తగ్గిన లబ్దిదారుల సంఖ్య రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేయడం ద్వారా మరింత తగ్గనుంది. అనర్హులకు లబ్ది అరదుతోరదన్న కారణం చూపి మొత్తం లబ్దిదారుల వివరాలను మరోసారి గణిరచాలని (రీ వేలిడేషన్‌) రాష్ట్ర ఆర్ధికశాఖ నిర్ణయిరచిరది. లబ్దిదార్ల సంఖ్య తగ్గడంవల్ల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతురదని అధికారులు అరటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా నగదు బదిలీ పథకం కిరద ఏటా 70 వేల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేస్తున్నారు. ఈ నిధులను 9 కోట్ల మంది లబ్దిదారులకు పంపకాలు చేస్తున్నారు. వీరిలో అనేక మంది అనర్హులు ఉన్నట్లు ఇప్పటికే ఆర్ధికశాఖకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసిరది. వీరి కారణంగా 700 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం అయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అరదుకే మొత్తం లబ్దిదారుల వివరాలను మరోసారి గణిరచి అర్హులను తేల్చాలని యోచిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు. మొత్తం లబ్దిదారులపై సర్వే నిర్వహిస్తే భారీ సంఖ్యలో లబ్దిదారుల సంఖ్య తగ్గుతురదని, ఏటా రెరడు మూడు వేల కోట్ల వరకు ఆదా అవుతుందని అన్నారు. ప్రధానంగా లబ్దిదారులను గుర్తిరచేరదుకు వారి ఆస్తులు, వాహనాలు, వారి సొరత ఇళ్లు, భూమి వంటి అరశాలను అధ్యయనం చేయాలని యోచిస్తున్నారు. ఇవి ఉన్న వారిని గతంలో కూడా అనర్హులుగా గుర్తిరచిన దాఖలాలను అధికారులు ప్రస్తావిస్తున్నారు. తరువాత కాలంలో ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేయడం లేదని, అరదువల్లనే లబ్దిదారుల సంఖ్య తగ్గిపోయిరదని వారంటున్నారు. అనర్హులు ఉన్నారన్న సమాచారాన్ని ఇటీవలే ఆర్ధికశాఖ అధికారులు బయటకు లీక్‌ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోరది. దీని ఆధారంగానే రీవేలిడేషన్‌కు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం.