May 31,2023 22:03

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌డిఒ శీనానాయక్‌

లే అవుట్‌ రికార్డులు పరిశీలన
ప్రజాశక్తి-దగదర్తి : తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం కావలి ఆర్‌డిఒ శీనానాయక్‌ జగనన్న లే అవుట్‌ సంబంధించి రికార్డులను పరిశీలించారు. అనంతరం జగన్‌ కాలనీలకు సంబంధించి ఎన్ని గ్రామాల్లో కోరు కేసులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసుల పరిష్కారం కానిచోట ప్రత్యాయంగా ల్యాండ్‌ను చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 32 గ్రామాలకు గానూ 11 గ్రామాలకు కోర్టు కేసులు నడుస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపిపి తాళ్లూరు వెంకట ప్రసాద్‌ నాయుడు మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు జగన్‌ అన్న లేఅవుట్‌ పత్రాలను అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి తహశీల్దారు పెంచలయ్య, డివిజన్‌ సర్వేయర్‌ రాము, సర్వేయర్‌ శివ, ఈ సర్వే డి టి వి, ఆర్‌ ఐ వెంకటేశ్వర్లు, విఆర్‌లు, తదితరులు పాల్గొన్నారు.