Apr 08,2021 23:29

పోలీసులతో మాట్లాడుతున్న ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌

ప్రజాశక్తి-దరిశి: ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని ఎస్‌పి సిద్ధార్ధ కౌశల్‌ అన్నారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందో తెలియనందున బ్యాలెట్‌ బాక్సులకు భద్రత కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణవేణి, మండల ఎన్నికల అధికారి ఎడి అర్జున్‌నాయక్‌, ఎంపిడిఒ గుత్తా శోభన్‌బాబు, సిఐ భీమానాయక్‌, ఎస్‌ఐ రామకోటయ్యలు ఉన్నారు. అద్దంకి: స్థానిక ప్రకాశం బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ పరిశీలించారు. ఎన్నికల అధికారులు, ఎంపిడిఒను కలిసి మాట్లాడారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు.