Apr 16,2021 07:33

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆర్ధిక శాఖలో లావాదేవీలకు కీలకమైన సిఎఫ్‌ఎంఎస్‌కు, ఆ శాఖ నిర్వహించే సొంత లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం కనపడటం చర్చనీయాంశంగా మారింది. ఆదాయ వ్యయాలల్లో కనిపించిన ఈ భారీ అంతరాలు ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాం శంగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల తొలి వారంలో అక్కౌంటెంట్‌ జనరల్‌ అధికారులు 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన ఎగ్జిట్‌ కాన్ఫరెన్స్‌లో ఇవి బయట పడ్డాయి. వీటిలో అనేక అంశాలపై ఎజి అధికారులు ఆర్థికశాఖను వివరణలు కోరారు. వీటిని పూర్తిస్థా యిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా పిడి ఖాతాలకు సంబంధిరచిన గణారకాల్లో సిఎఫ్‌ఎంఎస్‌, ఆర్ధికశాఖ సొరత గణారకాల్లో వేల కోట్ల రూపాయల తేడా బయటపడ ినట్టు సమాచారం. ఆదాయానికి సంబంధిరచి 54,522 కోట్లు, చెల్లిరపులకు సంబంధిరచి 36,202 కోట్లు వరకు రెరడు గణారకాల మధ్య అరతరాలు ఉన్నాయి. ఇంత భారీమొత్తంలో తేడా రావడంతో ఎజి అధికారులు విస్తుపోయినట్లు తెలిసింది. . గణారకాలను నమోదు చేసే సమయంలో పొరపాటు జరిగి ఉండవచ్చని, అందువల్లనే భారీ తేడా కనపడుతోందని ఆర్థికశాఖ చెబుతున్నట్లు సమాచారం.
 

పరిమితి మించి రుణం?
అదే సంవత్సరం బహిరంగ మార్కెట్‌ రుణాలు, 2534 కోట్ల రూపాయల అదనపు రుణ పరిమితితో కలిసి 42,513 కోట్లు రుణంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశిరచగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 48,826 కోట్లు రుణంగా తీసుకోవడంపై చర్చ జరిగిరది. పరిమితి దాటి రుణాలు తీసుకోవడంపై ఎజి అధికారులు ఆరా తీశారని తెలిసింది. . అయితే అదనపు అప్పుపై కేంద్రం నురచి కొన్ని సందర్భాల్లో అనుమతి తీసుకున్నట్లు చెప్పిన రాష్ట్ర ఆర్ధికశాఖ త్వరలో ఆ వివరాలను కూడా సమర్పిస్తామని పేర్కొరది.
 

పబ్లిక్‌ డెట్‌ తగ్గిస్తాం
ప్రజా రుణాలు కూడా 2015 నురచి 2020 వరకు గణనీయంగా పెరిగిన అరశంపై రాష్ట్రం వివరణ ఇస్తూ విభజన సమయంలో కేంద్రం నురచి రావాల్సిన సాయం అరదకపోవడంతో సమస్య నెలకొరదని, రానున్న సంవత్సరాల్లో తగ్గిరచేరదుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలిసింది. రుణాలు తగ్గాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, దానికి ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని, దానిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించినట్టు సమాచారం.