Jul 29,2021 23:19

ప్రజాశక్తి-శింగరాయకొండ: లెక్కలు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని శింగరాయకొండ సివిల్‌ సప్లై గోడౌన్‌ సిబ్బందిని కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితా సింగ్‌ హెచ్చరించారు. స్థానిక గోడౌన్‌ను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు పరిశీలించారు. గోడౌన్‌లో ఎన్ని బియ్యం ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ను పరిశీలించారు. లెక్కలకు, ఉన్న స్టాక్‌కు తేడాలున్నాయని, అధికారులు మరోసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఇక్కడ చిన్న చిన్న లోపాలున్నాయని, వాటినిసరిచేసేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మరోసారి పరిశీలించి లోపాలు, లెక్కలు సరి చేయకుంటే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆమె వెంట తహశీల్దార్‌ ఎస్‌.ఉషారాణి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటి భూపతి వర్మ పాల్గొన్నారు.