Mar 28,2021 12:07

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని ఘోఘా తహశీల్‌లోని బాడి-హోయిదాద్‌ గ్రామాల నివాసితులను తెల్లారేసరికి కొన్ని దృశ్యాలు అయోమయానికి గురిచేశాయి. చక్కగా చదునుగా ఉండే వారి పంట పొలాలు ఉన్నట్లుండి రాత్రికి రాత్రే బీటలు వారాయి. ఆపై 13 మీటర్ల ఎత్తుకు పెరిగి, పెద్ద పెద్ద దిబ్బలు ఏర్పడ్డాయి. దీనిపై మూడు నెలల తరువాత స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం లిగ్నైట్‌ మైనింగ్‌ కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించింది.


గుజరాత్‌ కాలుష్య నియంత్రణ మండలి (జిపిసిబి) ఈ పరిస్థితికి కారణమైన మైనింగ్‌ మాఫియా దోషులకు షో-కాజ్‌ నోటీసు జారీచేసింది. రాష్ట్రం ప్రమోట్‌ చేసిన గుజరాత్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జిపిసిఎల్‌). జీపీసీఎల్‌తో పనిచేసే లిగ్నైట్‌ మైనింగ్‌ సైట్‌ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. నీరు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం-1974, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం-1981, పర్యా వరణం (రక్షణ) చట్టం 1986 కింద దోషులను ఎందుకు విచారణ చేయరాదని జిపిసిబి తన నోటీసులో పేర్కొంది.


భూమి తిరుగుబాటు ఒక వివిక్త సంఘటన కాదు. నవంబర్‌ నుండి, జిపిసిఎల్‌ లిగ్నైట్‌ మైనింగ్‌ సైట్‌ చుట్టూ వివిధ స్థాయిల్లో భూమి పెరుగుదల కనిపించింది. మొదటి సంఘటనను గుర్తించిన సమయంలో వడోదర ఆధారిత పర్యావరణ చర్య బృందం, పర్యావరణ సురక్ష సమితి (పిఎస్‌ఎస్‌) ఈ స్థలాన్ని సందర్శించింది. అక్కడ పరిస్థితుల డాక్యుమెంటేషన్‌ను రికార్డ్‌ చేసింది. అక్రమ మైనింగ్‌పై నవంబర్‌ 26న సంబంధిత అధికారులకు రాసిన లేఖలో, పిఎస్‌ఎస్‌ మైనింగ్‌ స్థలంలో అన్నిపనులనూ నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. చుట్టుపక్కల గ్రామాలకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని. ఈ లేఖను నవంబర్‌ 30, డిసెంబర్‌ 18న రిమైండర్‌లతో అనుసరించారు. పిఎస్‌ఎస్‌ లేఖపై స్పందించిన జిపిసిబి చివరకు ఘోగాలోని ప్రాంతాన్ని సందర్శించి, పిఎస్‌ఎస్‌ ఎత్తి చూపిన అనేక పర్యావరణ ఉల్లంఘనలను గమనించి, స్పందించింది. జీపీసీబీ డిసెంబర్‌ 31న జీపీసీఎల్‌కు నోటీసు జారీ చేసింది.
 

షోకాజ్‌ నోటీసులోని అంశాలు..
పర్యావరణ నిబంధనలను పాటించకపోవడంపై షో-కాజ్‌ నోటీసులో ఇలా పేర్కొన్నారు. 'ఈ నోటీసు అందిన 15 రోజుల వ్యవధిలో పర్యావరణ చట్టం నిబంధనలు, వాటర్‌ యాక్ట్‌, ఎయిర్‌ యాక్ట్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ (పి) చట్టం, 1986 ప్రకారం, మీరు చేసిన నేరాలకు ఎందుకు విచారణ చేయకూడదు.' అనే దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. జిపిసిఎల్‌ ప్రతిస్పందన సమర్పించినప్పటికీ, జిపిసిబి తన చర్యతో ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. నీటిచట్టం, వాయుచట్టం, ప్రమాదకర, ఇతర వ్యర్థాల నిబంధనలు, 2016 నిబంధనల ప్రకారం జిపిసిబి 2018 మేలో కార్యకలాపాలు ప్రారంభించడానికి జిపిసిఎల్‌ సమ్మతి ఇచ్చింది. జిపిసిబి అనుమతి 2022 డిసెంబర్‌ వరకూ చెల్లుతుంది.


మైనింగ్‌ యూనిట్‌లో నడిచే శుద్ధి కర్మాగారం (ఇటిపి), మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్‌టిపి) లేవని, లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయకుండానే క్రష్షింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసినట్లు జిపిసిబి నోటీసు సూచించింది. బొగ్గు క్రష్షింగ్‌, రాతి క్రష్షర్ల యూనిట్ల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల నుండి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిపిసిఎల్‌ లైసెన్స్‌ లేకుండా ఒకటి పనిచేస్తోంది, ఇందుకు అవసరమైన వాయు కాలుష్య నియంత్రణా చర్యలు లేవు. ప్రతిస్పందనగా, మురుగునీటిని పరిష్కరించడానికి ప్లాంట్లను నిర్మించే చర్యలను జిపిసిఎల్‌ ప్రారంభించింది.


జిపిసిబి, జిపిసిఎల్‌ ఒక బ్యూరోక్రాటిక్‌ నాటకం ఆడుతున్నప్పటికీ, పిఎస్‌ఎస్‌కు చెందిన రోహిత్‌ ప్రజాపతి, కృష్ణకాంత్‌ తమ డిమాండ్‌లో పట్టుదలతో ఉన్నారు. పూర్తిస్థాయిలో పనిచేసే ఇటిపిని వ్యవస్థాపించే వరకూ అన్ని పనులూ ఆపేయాలని, యూనిట్లు ఏర్పాటు చేస్తేనే అనుమతిస్తామని, ఒకవేళ దీనిని ఉల్లంఘించే చర్యలు చేపడితే మైనింగ్‌ను పూర్తిగా నిలిపేస్తామని పేర్కొంది. జిపిసిఎల్‌కు నోటీసు జారీ చేయాలని పిఎస్‌ఎస్‌ ఒత్తిడి తెస్తోంది. ఇటిపి, ఎస్‌టిపి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని జిపిసిఎల్‌ చెప్పినప్పటికీ, భూమి పెరుగుదల వెనుక గల కారణాలను ఇది నేరుగా పరిష్కరించలేదు.


బాడి-హోయిడాడ్‌ గ్రామాల చుట్టూ యాధృచ్ఛికంగా చేపట్టిన పరీక్షపై జిపిసిబి నోటీసు ఆధారంగా.. లిగ్నైట్‌ మైనింగ్‌ సైట్‌ చుట్టూ ఉన్న ఏడు గ్రామాల నుంచి సేకరించిన 16 భూగర్భజలాలు మొత్తం పిహెచ్‌ అధ్యయనంలో మొత్తం కరిగిన ఘనపదార్థాలు (టిడిఎస్‌), మెగ్నీషియం, క్లోరైడ్‌, అధిక ఆమ్ల పదార్థాలను చూపించాయని వారు పేర్కొన్నారు. ఈ నీరు మానవ, జంతువుల వినియోగానికి అలాగే నీటిపారుదలకి అనర్హమైనదని పిఎస్‌ఎస్‌ తెలిపింది. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల గాలి, నీరు, నేల నాణ్యతను దిగజార్చే క్రమబద్ధీకరించని మైనింగ్‌ కార్యకలాపాల వల్ల భూగర్భజలాలు కలుషితమయ్యాయని వారు తేల్చారు. మైనింగ్‌ సైట్‌ నుండి నమూనాల పేలవమైన నాణ్యత గురించి.. గుజరాత్‌ ప్రధానకార్యదర్శి, గుజరాత్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యొక్క సీఈఓ, రాష్ట్ర పర్యావరణ, పరిశ్రమలు, గనుల విభాగాల ఉన్నతాధికారులకు హెచ్చరికలతో పిఎస్‌ఎస్‌ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.