
లండన్ : భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. స్విస్బ్యాంక్ యుబిఎస్తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంలో ఎన్ఫోర్స్మెంట్ స్టే ఇవ్వడానికి బ్రిటన్ కోర్టు నిరాకరించింది. దీంతో లండన్లోని ఖరీదైన ఇంటి కోసం చేసిన న్యాయ పోరాటంలో ఆయన ఓడిపోయారు. లండన్లోని రీజెంట్స్ పార్క్ ఎదురుగా ఉన్న 18/19 కార్న్వాల్ టెర్రేస్ లగ్జరీ అపార్ట్మెంట్ను కోర్టులో అసాధారణమైన విలువైన ఆస్తిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో మాల్యా.. తన తల్లి లలితతో నివసిస్తున్నారు. రుణం చెల్లించక పోవడం వల్ల ఇల్లు ఖాళీ చేయాలని యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రుణం చెల్లించడానికి సమయమివ్వాలని కోరుతూ విజరు మాల్యా న్యాయవాదులు చేసిన అభ్యర్థనను యూకే హైకోర్టు ఛాన్సరీ విభాగం సిట్టింగ్ జడ్జి తిరస్కరించారు.