Oct 26,2021 21:24

దుబాయ్: న్యూజిలాండ్‌ పేసర్‌ లోకీ ఫెర్గ్యూసన్‌ టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. మోకాళ్ల నొప్పులు, దగ్గుతో బాధపడుతున్న ఫెర్గ్యూసన్‌ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశాడు. 30ఏళ్ల ఫెర్గ్యూసన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో రాణించాడు. తాజాగా తీసిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో అతని ఎముకలు చిట్లినట్లు తేలింది. దీంతో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ఫెర్గ్యూసన్‌ దూరం కాగా.. అతనికి నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు.