Oct 03,2022 23:26
  • పాడెమోసిన సిపిఎం అగ్రనాయకత్వం
  • పయ్యంబాలెం బీచ్‌లో అంత్యక్రియలు
  • తరలివచ్చిన ప్రజానీకం

కన్నూరు : మతోన్మాదం, నిరంకుశత్వం, నిర్బంధంపై రాజీలేని పోరు సాగించిన యోధుడు కొడియేరి బాలకృష్ణన్‌ పయ్యంబాలెం బీచ్‌లో శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇ.కె. నయనార్‌, సిపిఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి చడియన్‌ గోవిందన్‌ల స్మారక చిహ్నాల మధ్య కొడియేరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. అశేష ప్రజానీకం 'యోధుడా.. ఇక సెలవు' అంటూ చేసిన నినాదాలు మారుమ్రోగాయి. కన్నూరులోని సిపిఎం జిల్లా కార్యాలయం నుండి పయ్యంబాలెం బీచ్‌ వరకు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా జన ప్రవాహం కదలింది. 'వీరునికి మరణం లేదు... మా జ్ఞాపకాలలో, ఆచరణలో నీవెప్పుడూ సజీవమే' అంటూ కన్నీటితో ప్రతిన చేసింది. పయ్యంబాలెం బీచ్‌వద్ద సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులు పాడె మోసి తమ సహచరునికి తుది నివాళులర్పించారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరగడమే తప్ప తడబడటం ఎరగని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గళం మొట్టమొదటిసారి తడబడింది. గుండెల నిండా విషాదం నిండటంతో సంతాపసభలో ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. గద్గద స్వరంతో 'మిత్రమా .. ఇక సెలవు' అంటూ అసంపూర్తిగా ముగించారు.

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan

 

last salute to balakrishnan