ఎల్బీనగర్‌లో వ్యక్తి దారుణహత్య

తెలంగాణ : ఎల్బీనగర్‌ పరిధిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి మహేష్‌ అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో వేటాడి చంపారు. అంతకుముందే కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత గొడ్డలి, కత్తులతో దాడి చేసి హతమార్చారు. మహేష్‌ ఇటీవలే ఓ కేసులో బెయిల్‌ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

➡️