న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో 332 వద్ద గాలి నాణ్యతలు నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో.. ఆనంద్ విహార్ వద్ద 393, అశోక్ విహార్ 356, ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 322, జహంగీర్ పురి 381 స్థాయిల్లో గాలి నాణ్యతలు నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.
కాగా, ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోవడంతో.. స్థానికులు శ్వాకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే రోజూ కళ్లు మండుతున్నాయని, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.