నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, శనివారం ఈ చిత్ర టైటిల్ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’గా రివిల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్రబృందం విడుదలచేసింది. సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్. సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు. సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగం పూర్తయ్యాక, రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
