శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మదరాసి’. అయిలాన్, మావీరన్, అమరన్ వంటి వరుస విజయాలను శివకార్తికేయన్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. మదరాసి సినిమాకు ఎఆర్ మురుగదాస్ దర్శకుడు. విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజూమీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని నిర్మాతలు తెలిపారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.
