శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి

2 రోజుల క్రితం

AIKS_Flag.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఐకెఎస్‌ డిమాండ్

  • మేఘమలై-వరుసనాడులో అక్రమ తొలగింపులను ఆపాలి

న్యూఢిల్లీ : తమిళనాడులోని తేని జిల్లాలో గల అగస్త్యమలై బయోస్పియర్‌ ‌రిజర్వ్‌ (ఎబిఆర్‌)‌లో భాగమైన మేఘమలై-వరుసనాడు ప్రాంతంలోని 5,072.653 హెక్టార్ల భూముల్లో నివాసముంటున్న సాంప్రదాయ అటవీ వాసులను అక్కడ నుండి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఎఐకెఎస్‌) ‌పేర్కొంది. ఇటువంటి ప్రయత్నాల ద్వారా వలసవాద, ప్రజాస్వామ్య వ్యతిరేక వారసత్వం తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తోందని ఎఐకెఎస్‌ ‌విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

తేని జిల్లాలోని 9 గ్రామ పంచాయితీల వ్యాప్తంగా వున్న దాదాపు 25వేలమంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో అధిక శాతం మంది సన్నకారు రైతులే. ఇది, ప్రభుత్వం వ్యవస్ధాగతంగా, ఉద్దేశ్యపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న కేసని స్పష్టమవుతోందని పేర్కొంది. రైతులను ఆక్రమణదారులుగా ముద్రవేస్తూ, అక్కడ నుండి రైతులను తరిమివేయడానికి తమిళనాడు అటవీ శాఖ ప్రతి నీచపుటెత్తుగడనూ అమలు చేస్తోందని ఆ ప్రకటన విమర్శించింది. ఈ చర్యలకు ప్రభావితమవుతున్న రైతాంగంలో అధికులు ఆదివాసీలు, దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుకుల చెందినవారేనని పేర్కొంది. భారత పాలక వర్గాలు అమలు చేసే అత్యంత ఆటవికమైన అటవీపాలనకు ఇది అద్దం పడుతోందని ఎఐకెఎస్‌ ‌విమర్శించింది.

ఈ ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)ను సంపూర్ణంగా అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఎఐకెఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోంది. అలాగే సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని దాని వాస్తవ స్ఫూర్తికి అనుగుణంగా సమర్ధించాలని కోరుతోంది. ఎఫ్‌ఆర్‌ఎను బలోపేతం చేసేందుకు, అటవీ ప్రాంతాల్లోని అటవీ వాసులను అక్రమంగా తరలించడాన్ని ప్రతిఘటించేందుకు ముందుకు రావాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య వర్గాలకు పిలుపిచ్చింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్