సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు వైఎస్‌ఆర్‌ అవార్డు

4 రోజుల క్రితం

AWARD.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్‌ అవార్డు–2026ను ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌)కు ప్రదానం చేశారు. బుధవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ లోని మౌలాంకార హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంగలక్ష్మి అవార్డును స్వీకరించారు. అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రైతులకు వైఎస్‌ఆర్‌ ‌చేసిన కృషిని కొనియాడారు. రైతులు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కెవిపి రామచంద్రరావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు రాజకీయ, సామాజిక, వ్యవసాయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయ విధానాలు, జీవ వైవిధ్య పరిరక్షణ, గ్రామీణ ప్రజల జీవనోపాధి తదితర రంగాల్లో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు కెవిపి రామచంద్రరావు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ పేదల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషికి గుర్తుగా వైఎస్సార్‌–కెవిపి ఫౌండేషన్‌ ఈ అవార్డును అందిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించడం ఈ అవార్డు లక్ష్యమని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్