డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
ప్రజాశక్తి - పెదకాకాని: పెదకాకానిలోని వై జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
శ్రీకాళహస్తి నుంచి విజయవాడ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కుతున్న సమయంలో బస్సులో నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను, వారి లగేజీని కిందకు దించాడు. ప్రయాణికులంతా బస్సు నుంచి దిగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్ అప్రమత్తతతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పెదకాకాని పోలీసులు తెలిపారు.








కామెంట్లు (0)