ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిద్ధారంలోనే తిష్ట వేసిన పెద్దపులి

08 జులై, 2026

tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేలేరుపాడు రూరల్ : తెలంగాణ అటవీ ప్రాంతం నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వారం రోజుల క్రితం ప్రవేశించిన పెద్దపులి సిద్ధారం అడవులలోనే తిష్ట వేసింది. రెండు రోజుల క్రితం సిద్ధారం గ్రామం వద్ద అడవిలో మూడు ఆవులపై దాడి చేసిన పెద్దపులి ఒక దాన్ని హతమార్చి చుట్టుపక్కల స్థావరం ఏర్పాటు చేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులికి అమర్చిన ట్రాకర్ సిగ్నల్స్ అందకపోవడంతో అటవీ అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వేలేరుపాడు మండలంలో అటవీ ప్రాంతమైన సిద్ధారం, కుంకుడు కొయ్య పాకలు గుట్టలపైనే పులి సేద తీరుతుందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. తర్వలోనే పులిని బంధిస్తామని అటవీ అధికారులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్