
ప్రజాశక్తి-కారంచేడు: ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కారంచేడు మండలం దగ్గుబాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ల్యాబ్ టెక్నీషియన్ సౌజన్యకు జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ సివి రమాదేవి చేతుల మీదుగా శుక్రవారం నాడు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో పర్చూరు ట్రీట్మెంట్ యూనిట్ కింద ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ ప్రశంసాపత్రం సౌజన్యకు అందజేశారు. దగ్గుబాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెక్నీషియన్‌గా సౌజన్య అందించిన సేవలకుగాను ఈ ప్రశంసా పత్రాన్ని ల్యాబ్ టెక్నీషియన్‌గా రావడం స్థానిక వైద్యులు సిబ్బంది ఆమెను అభినందించారు.