ఇవిఎంలపై పిటిషన్‌ కొట్టివేత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  : దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఇవిఎం)లకు బదులుగా పేపర్‌ బ్యాలెట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పిబి వరాలేతో కూడిన ధర్మాసనం విచారించిం ది. చంద్రబాబు, జగన్‌ వంటి నేతలు కూడా ఇవిఎంల ట్యాంపరింగ్‌ను ప్రశ్నించారని వాదన ల సందర్భంగా కెఎ పాల్‌ పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని, అదే పద్ధతిని ఇక్కడ కూడా పునరుద్ధరించాలని కోరారు. ఇవిఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తా యని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌ సహా పలు రాజకీయ పార్టీలు, నేతలు కూడా తన వైఖరికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘చంద్రబాబు, జగన్‌ వంటి వాళ్లు ఓడిపోయిన ప్పుడు ఇవిఎంలు ట్యాంపరింగ్‌ అరటారు. గెలిస్తే వాటి ప్రస్తావన చేయరు. దీనిని ఎలా చూడాలి? ఈ పిటిషన్‌ కొట్టివేస్తున్నాం. ఇలాం టివి వాదించే ప్రదేశం ఇది కాదు’ అని పేర్కొన్నారు.

➡️