మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌

Feb 12,2024 17:32 #bail petition, #Manish Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు అయ్యింది. తనకు మూడు రోజులు బెయిల్‌ ఇవ్వాలని మనీష్‌ సిసోడియా రూస్‌ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.. ఈ మూడు రోజులు మనీష్‌ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

➡️