కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదించిన యుఎన్‌ భద్రతా మండలి

ఐరాస :  గాజాలో ఇజ్రాయిల్‌ అమానుష యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో కాల్పుల విరమణ ప్రణాళికను ఆమోదించే మొదటి తీర్మానాన్ని యుఎన్‌ భద్రతా మండలి సోమవారం ఆమోదించింది. గత నెలలో అమెరికా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానంపై 14-0 ఓటింగ్‌ నమోదైంది. ఓటింగ్‌కు రష్యా గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనను తీర్మానం స్వాగతించింది. ప్రారంభ ఆరువారాల కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల కోసం గాజాలో ఉన్న కొంత మంది ఇజ్రాయిల్‌ బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చింది. రెండవ దశలో శాశ్వత కాల్పుల విరమణ మిగిలిన బందీల విడుదల ఉంటుంది. మూడవ దశలో విధ్వంసానికి గురైన గాజా స్ట్రిప్‌ పునర్నిర్మాణ ప్రయత్నం ఉంటుంది.

ఇజ్రాయిల్‌ ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. కూడా ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రణాళికను ఏవిధంగా అమలు చేయాలనే దానిపై పరోక్షంగా చర్చలు జరపడానికి సోదరులతో కలిసి పనిచేయడానికి హమాస్‌ సుముఖత వ్యక్తం చేసిందని అమెరికా తెలిపింది. షరతులు, నిబంధనలు లేకుండా తక్షణమే ఈ తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయాలని ఇజ్రాయిల్‌ – హమాస్‌లను కోరింది.

రంజాన్‌ సందర్భంగా గాజాలో మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ మార్చి 25న యుఎన్‌ భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉంది. అయినప్పటికీ గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను ఆపలేదు.

➡️