కుర్‌ కురే తీసుకురాలేదని విడాకులు కోరిన భార్య

May 15,2024 14:37

లక్నో : రూ. 5 విలువైన కుర్‌ కురే ప్యాకెట్‌ తీసుకురాలేదని భర్త నుంచి భార్య విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ మహిళకు రోజూ కుర్‌కురే తినే అలవాలు ఉండేది. కుర్‌ కురే అంటే తనకు ప్రాణం అని భర్తకు చెప్పేది. దీంతో ఆ భర్త కూడా రోజూ ఆఫీసు నుంచి వస్తూ
వాటిని తెచ్చి ఇచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసేవాడు. ఒకరోజు కుర్‌కురే తీసుకురాకుండా చేతులూపుకొంటూ వచ్చిన భర్తను చూసి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. నెలన్నర రోజుల తర్వాత విడాకులకు దరఖాస్తు చేసింది. ప్రతిరోజు జంక్‌ ఫుడ్‌ తింటే ఆరోగ్యం పాడవుతుందనే కారణంతోనే ఒకరోజు తాను కుర్‌ కురే తీసుకురాలేదని తెలిపాడు. కుర్‌కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. గత ఏడాదిలో ఈ దంపతులకు వివాహం జరిగింది.

➡️