Jul 03,2022 11:55

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గులుగా నమోదు అవుతున్నాయి. నిన్న 17 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఆదివారం స్వల్పంగా తగ్గాయి. శనివారం 3,76,720 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..16,103 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 31 మందిని మహమ్మారి బలితీసుకుంది. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,35,02,429. కాగా, 5.25 లక్షల మందికి పైగా మరణించినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 2,143 క్రియాశీలక కేసులు పెరిగాయి. యాక్టివ్‌ కేసుల శాతం 0.26 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 13,929 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 4.28 కోట్ల మంది కరోనాను జయించారు. అదే సమయంలో రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197.95 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేశారు.