Oct 02,2022 16:10
  •  గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న ఎల్ఐసి  ఏజెంట్లు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు : ఎల్ఐసి ఏజెంట్ల  సమస్యల పరిష్కారానికి దిక్సూచి  లీయాఫీ అని లీయాఫీ జోనల్ నాయకులు రమేష్, బ్రాంచ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ట్రెజరర్ శివ రాముడు పేర్కొన్నారు . ఆదివారం లీయాఫీ డే సందర్భంగా గాంధీ జయంతి, లాల్ బహూదర్ శాస్త్రి  జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రామ్ గణేష్, కార్యనిర్వాహణాధికారి మహేష్ కుమార్, డెవలప్మెంట్ ఆఫీసర్ మధుసూదన్ ఏజెంట్ల  దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సమస్యలపై ప్రసంగించారు. లియాఫీ డే సందర్భంగా 65 సంవత్సరాలు దాటిన  సీనియర్ ఏజెంట్లు  వెంకటేశప్ప రాజు తిరుపతయ్య మహమ్మద్ లను సన్మానించారు. ఖాళీగా ఉన్న సహాయ కార్యదర్శులు పోస్టులు మల్లికార్జున గౌడ్ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎల్ఐసి కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ఏజెంట్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ  విగ్రహానికి పూలమాలవేసి, ఎల్ఐసి యాజమాన్యము, ఐఆర్డిఎ, కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఏజెంట్ లకు, పాలసీ దారులకు నష్టం కలిగించే చర్యలను వెనక్కు తీసుకునేలా మంచి బుద్ధి కలిగేలా వారికి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు హరినాథ్,రామన్న బురళి.జిల్లా నాయకులు సోమన్న  రంగస్వామి బ్రాంచ్ నాయకులు  వీరేష్ వెంకటేష్  మోహన్ ప్రసాద్ స్వామిక్రిష్ణ రెడ్డి ఏర్రినాథ  ఏజెంట్లు  రాజగోపాల్ శెట్టి ఆనందయ్య శెట్టి రమేష్ రావ్ షబ్బీర్ గుడికల్ రామాంజినేయులు కలగట్ల చంద్ర కె సి చంద్రశేఖర్ గురురాజ్  ముగతి వీరారెడ్డి సోమశేఖర్ సూర్యనారాయణ రాజశేఖర్  మధు  ఈరన్నగౌడ్  సుదర్శన్ రావ్  ఖాజ హుస్సేన్‌ ‌నీలకంఠరెడ్డి దేవేంద్ర మూర్తి అబ్దుల్ గఫూర్ లక్ష్మన్న రాఘవేంద్ర, మల్లికార్జున గౌడ్ ప్రభాకర్ మహబూబ్ భాష వీరయ్యచారి  బరకత్  జిక్రియాపాల్గోన్నారు.