సంగమం

Apr 1,2024 04:56

ముద్ద మందారాన్ని
ముద్దు మందారం చేసి
శ్వేతపుష్పంపై హిమవర్షం వోలె
నువ్వు కురిపించిన ఆ మకరందం మాటకందదు
స్నేహగీతమో రాగబంధమో ఎరుక లేదు కానీ
నీ లోపల నన్ను నాలోపల నిన్నూ ఎరుగుదును!

ఆ చోటంతా అమృతత్వం
ఆ తావులో బిందువు నేను సింధువు నీవు..
ఎవరి వెంట ఎవరుంటేనేం
ఎవరిలో ఎవరైక్యమైతేనేం
ఇరువురన్న ధ్యాస మరచినప్పుడు
మోగుతున్న హృదయవీణే సంగమం
ఆ.. హృది చేసే శృతి లయలే మది మమేకం!
– కోడే యామిని దేవి,
94928 06520

➡️