స్వతంత్య్ర రాజ్యమా..!

Aug 26,2024 03:05 #aksharam

దేశమా… స్వతంత్య్ర రాజ్యమా..
ఆడదానిగా పుట్టటమే నేరమా!
విశృంఖల వికృత తృష్ణల
మృగారణ్య బాటలో
కదల లేక మెదల లేక
శిల నైతిని కల నైతినీ…
మానవత్వమే లేని
కామాసురుల నడుమ
వధించలేక లేక చరించ లేక
శిథిల మైతిని ఛిద్ర మైతినీ ..

కామాంధుల లోకంలో
కానరాని స్వేచ్ఛలో
శపించలేక గతించ లేక
చరణ మైతిని రణ మైతిని!
సాధించిన స్వాతంత్య్రం
చతికిలబడి చూస్తుంటే
చావ లేక దిగంబర మైతిని
బతక లేక అంబరాన సగమైతిని..!
– డా.కటుకోఝ్వల రమేష్‌
9949083327

➡️