గానకోకిల సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం

ప్రజాశక్తి-విజయనగరం కోట : గాన కోకిల పద్మభూషణ్‌ డాక్టర్‌ పి.సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నట్లు శ్రీగురు నారాయణ కళా పీఠం అధ్యక్షులు డాక్టర్‌ జి.సన్యాసమ్మ వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ.నారాయణ ప్రకటించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో స్థానిక ప్రైవేట్‌ హోటల్లో ఏర్పాటు చేసిన తృతీయ వార్షికోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ సభలో వారు మాట్లాడుతూ … గురు నారాయణ కళాపేతం తృతీయ వార్షికోత్సవం ఏప్రిల్‌ 1వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విజయనగరం ప్రజల సమక్షంలో సుశీలమ్మ కు పురస్కారాన్ని అందిస్తున్నామన్నారు. విజయనగరం ఆడపడుచు గాన కోకిల పి.సుశీలమ్మకు వయోభారమైనప్పటికీ విజయనగరం పై మక్కువతో ఈ పురస్కార స్వీకరణకు ఆమె అంగీకారం తెలిపారని అన్నారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు మణిశర్మ , లవకుశ, ఆనాటి మేటి సినిమాలో కుసుడు పాత్ర ద్వారా ప్రసిద్ధి పొందిన బాలనటుడిగా నటించిన మాస్టర్‌ సుబ్రహ్మణ్యం 76 ఏళ్ల వయసులో ఇప్పుడు రావడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు. సాయంత్రం 6 గంటలకు మణిశర్మ సారధ్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్‌ అధినేత బాబురావు, కోశాధికారి బి.పద్మావతి, గాయకులు పవన్‌, చరణ్‌, వైవివి.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️