కమ్యూనిస్టులు విలువలకు చిరునామాలు

Apr 17,2024 09:04 #sahityam

సాకీ :
దోపిడికి ఖబడ్దార్‌ రోదనకు ఖబడ్దార్‌
మోసాలకు ఖబడ్దార్‌ ద్వేషాలకు ఖబడ్దార్‌
విశ్వమానవుల ప్రపంచ గీతం
ఆలపించే కమ్యూనిస్టూ నీకు లాల్‌ సలాం
లాల్‌ సలాం నీకు లాల్‌ సలాం
పల్లవి :
కమ్యూనిస్టులు విలువలకీ చిరునామాలు
కమ్యూనిస్టులు పదవులకీ దూరముంటరు
తమ జీవితాలనే త్యాగం చేసి
అందరి బతుకుల బాగు కోరుతూ
సాగే వారే కమ్యూనిస్టులు
కడదాక జెండా విడువనివారే
కమ్యునిస్టులు కమ్యూనిస్టులు //క//
చ 1:
భ్రష్టాచారపు దుష్టశక్తులను
తుదముట్టించగ అడుగేశారు
ఆకలిదప్పులను ఈ గోళం నుండే
తరిమివేయగా నడుం కట్టిన
నిండు మనిషే కమ్యూనిస్టూ
దొడ్డ మనసే కమ్యూనిస్టులు //క//
చ 2:
ఎర్రని జండా మోసినంతనే
కామ్రేడుననీ పొంగరు వీరు
పేదల పక్షం నిలిచినప్పుడే
అసలైన వామపక్షం తమదని
నిలిచి పోరాడే వారే కమ్యూనిస్టులు
వారే కద ప్రజలకిష్టులు //క//
చ 3:
ఎక్కడ న్యాయం ప్రజలకందదో
ఎక్కడ క్షామం ఎదుర్కొందురో
ఎక్కడ క్షేమం జనులకందదో
అందరికంటే ముందరి అడుగై
వస్తారు కమ్యూనిస్టులు
వారే కద ప్రజలకిష్టులు //క//
చ 4:
తరతరాలుగా శ్రమదోపిడిలో
తలమునకలై జీవిస్తుంటే
పెట్టుబడి స్వరూపాన్ని చెప్పి
మీ న్యాయం మీకు జరగాలని
చెప్పిన వారే కమ్యూనిస్టులు
వారే కద ప్రజలకిష్టులు //క//
– జంధ్యాల రఘుబాబు

➡️