నవ్యాంధ్ర రచయితల సంఘం సారధ్యంలో గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్- శంకరం వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు ఆగస్టు 29, గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గిడుగు జాతీయ భాషా సాహిత్య కళా సేవా రంగాల పురస్కారాల ప్రదానం, తెలుగు భాషా పరిరక్షణపై కవి సమ్మేళనం వుంటాయి. నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ సభాధ్యక్షత వహించే ఈ వేడుకలకు ఎన్టీఆర్ లిటరేచర్, వెబ్సైట్ కమిటీ ఛైర్మన్ టి.డి.జనార్థన్ ముఖ్య అతిధిగా హాజరవుతారు. ఆంధ్రప్రభ సంపాదకులు వైయస్సార్ శర్మ, తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్, జియస్టి కమిషనర్, సాహితీవేత్త జెల్ది విద్యాధరరావు, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీమతి కాంతికృష్ణ, శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి ధనలక్ష్మి, సంఘసేవకులు కె.శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు
– కలిమిశ్రీ
నవ్యాంధ్ర రచయితల సంఘం