నాకూ ఓరోజు…

Aug 12,2024 03:46 #aksharam

నాకు ఓరోజు ఉందన్న చిరు ఆశే
ఎన్నో గండాల నుంచి గట్టెక్కిస్తుంది
నేనూ చేయగలనన్న చిరు సంకల్ప బలమే
ఎన్నో ఆశయాలకు నాంది అవుతుంది
నేనూ ఎదుర్కోగలనన్న ధైర్యమే
ఎన్ని కష్టాలను అయినా నీరుగారుస్తుంది
నేనూ ఓర్చుకోగలనన్న సహనమే
ఎన్నో ఒడిదుడుకుల నుంచి తప్పించగలదు
నేనూ అనుక్షణం చిందించగలనన్న చిరునవ్వే
ఎన్నో సమస్యలను తీర్చే అస్త్రమవుతుంది
నాకోసం ఒకరున్నారన్న చిరుధ్యాసే
జీవితంపై ఆశ పెంచుతుంది
నాకూ అంబరమంతా హృదయం ఉందన్న భావనే
ఏదేమైనా స్వీకరించే తత్వాన్ని సొంతం చేస్తుంది
అందరూ నావారే అన్న చిన్న ఆత్మీయతే
ఎందరినో దగ్గర చేస్తోంది
నేను సైతం సమిధనౌతానని ముందుకొస్తే
కర్మలన్నీ యజ్ఞాలై సమాజానికి వరమవుతావు
– డా.మంగళ మక్కపాటి,
హైదరాబాద్‌

➡️