వేలు

May 13,2024 05:15

నీవు
నామాలు అడ్డంగానో నిలువుగానో
అభ్యంతరం లేదు
కుంకుమ కనుబొమ్మల మధ్యనో
పసుపు చెంపల కిందుగానో
అభ్యంతరం లేదు
ఔను… నీ దేహం నీది
కట్టుకి బొట్టుకి నీకు పూర్తి స్వేచ్ఛ
మేం కోరేది ఒక్కటే!
ఎడంచేయి చూపుడు వేలు మీద
నల్లచుక్క మాత్రం
దేశం కోసం గుర్తు పెట్టుకో!
– కోటం చంద్రశేఖర్‌, 94920 43348

➡️