పచ్చని హరితవనం
అక్కడ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి
సున్నం పిండి లాంటి ఇసుక దిబ్బలు
వాటి మీద ముగ్గులేసినట్టు చక్కటి జీడి మామిడి
వాటి మధ్య అక్కడక్కడ
పనస మునగా అరటి పొదలు
మనుషులతో పాటు
ఎన్నో జంతు జీవరాసులకు ఆవాసాలు, అనుకూలాలు
ఆ పక్కనే ఎగిసిపడిన సంద్రం
ఆటుపోటుల మధ్య ఈతి బాధలు
ఇప్పటికే ఎండిన జీడిపిక్కలు లాగే
కాటికి కాలుచాపుతున్న మూత్ర పిండాలు, గండాలు
పుండు మీద కారంపొడిలా వాలిపోతున్నారు
గద్దల్లా పొడవ ముక్కు పెద్దలు
ఇప్పుడు ఉద్దానం వణికిపోతోంది
గద్దె మీద పెద్దల్లారా
ఇప్పుడు ఉద్దానం ఒంటరి కాదు
ఉద్యమాల గెడ్డ మీదకి
విమానాలు వస్తాయంటే ఊరుకోరు
తరిమి తరిమి కొడతారు
సోంపేట బీలను చూడండి
కాకరాపల్లి కదనం కనపడలేదా?
మా చేతులు కలిస్తే
మీ చేతలు బలాదూర్!
– నిశితాసి