ఆ మౌనం ఏం చెప్పింది!

పహల్గాంలో భర్త పక్కన ఆమె మౌనం
దీనంగా, నిస్సహాయంగా
ఏం చెప్పింది, ప్రతి మనిషికి
ఏ సున్నితమైన వ్యక్తి కూడా
ఇప్పుడు మౌనంగా ఉండలేడు!

కొంచెం అటు ఇటుగా కట్టుబొట్టు తప్ప
అందరూ ఒకే బతుకు బతుకుతున్నారు
మీరు పిచ్చోళ్ళు కాకపోతే
మీకూ వాళ్ళకూ వైరమేముంది?
దుస్తుల్లోపల
ఎవరో మతం పేరు చెప్పి
మీలో మూర్ఖత్వాన్ని నూరిపోసి
ప్రాణాలను తీయమంటే తీసి
కన్నీళ్ళను అమ్ముకుంటున్నారు
మీరు మనుషులు కాకపోతే
మీ అమ్మ పేగు కూడా విలవిల్లాడుతుంది
విగతజీవుల్ని చూసి
ఏ దేవుడూ సంతోషించడు!

అందమైన దేవదారు చెట్లమధ్య
ముళ్ళచెట్లలా మీరు మానవాళికి భిన్నంగా ఉన్నారు
ఏడ్చేవాళ్ళను చూసి నవ్వుతున్నారు
కన్నీళ్ళు తాగి కడుపు నింపుకుంటున్నారు
రాక్షసులను మించిపోయారు
మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి
ఏదైనా మానవత్వం పాదుకొల్పేదే మతం!

– శాంతయోగి యోగానంద, 96522 71520

➡️