Nov 25,2022 16:36

ప్రజాశక్తి - జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం విద్యుత్ శాఖ కార్యాలయ  సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం తెల్లవారు జామున చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు క్లీనర్ కు గాయాలు కాగ వారిని స్థానికులు హుట హుటిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన స్థానికులు చేపలను తీసుకు వెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో సంఘటన స్థలంలో చేపలతో పాటు ట్రేలను కూడా మాయం చేసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని జనాన్ని వెళ్లగొట్టారు. కాగ లారీ కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్ కు చేపల లోడుతో వెళ్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్ల ప్రమాదం జరిగి  ఉండవచ్చని స్ధానికులు భావిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లూ ఎస్.ఐ వి చంద్ర శేఖర్ తెలిపారు..