Oct 13,2021 15:17

హైదరాబాద్‌: మా ఎన్నికలు పూర్తయినప్పటికీ ఉత్కంఠత అయితే ఇంకా ముగియలేదు. ఎన్నికయిన ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు 11 మంది వారి పదవులకు రాజీనామా చేశారు.ఆ తర్వాత మంచు విష్ణు ప్యానెల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మా కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా పూర్వ అధ్యక్షుడు నరేష్‌ మాట్లాడుతూ ఈరోజు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత విమర్శలు చేయడమేంటని అన్నారు. మా అందరి సంస్థ అని, అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. కొత్త పాలకవర్గం ప్రశాంతంగా పనిచేసేలా చూడాలన్నారు. కొత్త అధ్యక్షుడు విష్ణును ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగోదన్నారు. ఎన్నికలు జరిగేప్పుడు అందరం ఒకటే అని చెప్పి, ఎన్నికల తర్వాత రాజీనామాలు చేయడమేంటని ప్రశ్నించారు. మోడీ గెలిచాడని కాంగ్రెస్‌ వాళ్లందరూ దేశం విడిచిపెట్టి వెళ్ల లేదు కదా అని నరేశ్‌ అన్నారు.