Nov 20,2020 17:05

పాకిస్తాన్‌ : 'మాకు సోదరిగా.. మా భర్తకు నాలుగో భార్యగా రావాలి... ఆమె పేరు ఎస్‌తో ప్రారంభమవ్వాలి' అంటూ ఓ ప్రకటన తెగ వైరల్‌ అవుతోంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. మొదట చేసుకున్న ముగ్గురు భార్యలే.. నాలుగో భార్య కావాలంటూ.. ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ సియాల్‌కోట్‌కు చెందిన అద్నాన్‌ అనే వ్యక్తికి 16 సంవత్సరాల వయస్సున్నప్పుడే మొదటిసారి వివాహం అయ్యింది. మళ్లీ 20 ఏళ్ల వయసులో రెండోసారి వివాహం... గతేడాది మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం 22 ఏళ్ల అద్వాన్‌ నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ముగ్గురి భార్యల పేర్లు 'ఎస్‌'తోనే ప్రారంభమవుతాయి. ఇక నాలుగో భార్య పేరు కూడా 'ఎస్‌'తోనే ప్రారంభమవ్వాలని సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. కాగా, మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో భార్య ఒకరిని దత్తత తీసుకున్నారు. అయితే ఎవరికైనా ముగ్గురు భార్యల మధ్య సఖ్యత ఉంటుందా? అనే అనుమానం రాకమానదు. కానీ ఆ ముగ్గురి భార్యల మధ్య ఎంతో సఖ్యత ఉంటుందని... ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని సర్దుకుపోతారని అద్వాన్‌ అన్నారు. కాకపోతే ఆ భార్యలందరిదీ అయనపై ఏకైక ఫిర్యాదు ఏమిటంటే.. తమతో తగిన సమయం గడపడం లేదని భావిస్తారు. ముగ్గురు భార్యలు తననెంతో ప్రేమగా చూసుకుంటారని.. తాను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నానని అద్వాన్‌ తెలిపారు. ఇక కుటుబ పోషణ విషయానికొస్తే... నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చవతుందట. ఆరు బెడ్‌ రూములు, డ్రాయిగ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌ ఉన్న ఇంట్లో ఉంటానని వెల్లడించారు.