Jul 04,2022 00:11

అంబేద్కర్‌ను నివాళి అర్పిస్తున నాయకులు


ప్రజాశకి-పాయకరావుపేట:ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు నుంచి అత్యధిక సంఖ్యలో తరలిరావాలని ఏపీ ఎంఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు పిలుపు ఇచ్చారు.రాష్ట్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా విచ్చేసిన రాష్ట్ర ప్రతినిధుల బృందం పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించింది. ఈ మేరకు కరపత్రాలను అందజేశారు. అనంతరం పాయకరావుపేటలో ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ అంశంపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని తెలిపారు.వర్గీకరణ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ ఈ నెల 10న మాదిగల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ ఎమ్మార్పీఎస్‌ జాతీయ సలహాదారు అరుగుల కొండబాబు మాట్లాడుతూ, మాది గలకు సామాజిక న్యాయం చేయాలన్నారు.
ఏపీ ఎమ్మార్పీఎస్‌ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కాండ్రకోట రాజు మాట్లాడుతూ,సామాజిక న్యాయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాలయాపన తగదని పేర్కొన్నారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉందుర్తి ప్రసాదరావు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏడిద వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు..