Jun 10,2021 10:29

న్యూఢిల్లీ : ఏషియన్‌ గేమ్స్‌ బంగారు పతాక విజేత... మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ (42) కన్నుమూశారు. 2017 నుండి లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. మణిపూర్‌కు చెందిన ఈ బాక్సర్‌ గత ఏడాది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయన మృతికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తీవ్ర సంతాపం తెలిపారు. డింకోసింగ్‌ మృతి పట్ల తానెంతో బాధపడ్డాడని, భారత్‌లో అత్యుత్తమ బాక్సర్‌లో ఆయన ఒకరని అన్నారు. 1998లో బ్యాకాంక్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో బంగారు పతాకాన్ని గెలిచి... దేశంలో బాక్సింగ్‌ ఎదుగుదలకు బాటలు వేశారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో బాక్సర్‌, ఒలింపిక్‌ విజేత విజేంద్ర సింగ్‌ కూడా సంతాపం తెలిపారు. 1998లోనే ఆయనకు అర్జున అవార్డు లభించింది.