Oct 28,2021 17:14

హైదరాబాద్‌ : హాసని అనే యువతి ఉరి వేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్‌ పోస్టు చేసింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే నారాయణగూడ పోలీసులు స్పందించారు. హిమాయత్‌ నగర్‌ రోడ్‌ నెంబర్‌ 6లో ఉన్న ఆమె ఫ్లాట్‌లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్‌ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలే ఆమెను శారీరకంగా ఓ యువకుడు వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హాసిని 2018లో మిస్‌ తెలంగాణగా యువతి ఎంపికైంది.