Sep 27,2021 16:17

ప్రజాశక్తి-కంచికచర్ల
కంచికచర్ల మండలం గనిఆత్కురు మాజీ సర్పంచి కొమ్మినేని నరశింహారావు మృతదేహాన్ని సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొమ్మినేని నరశింహారావు గుండెపోటుతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎంపీ కేశినేని నాని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి గనిఆత్కూరులో కొమ్మినేని నరశింహారావు మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ టిడిపి నాయకులు గన్నే వెంకట నారాయణ, మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు నాయకులు మూరకొండ ఏడుకొండలు,వెంపరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.