May 03,2021 19:21

అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న విజయనగరం యూత్‌ఫేస్‌బుక్‌ సభ్యులు

కంటోన్మెంట్‌ : మానవత్వంతో కరోనా మృతులకు అంత్యక్రియలను పలువురు యువకులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం మెరకముడిదాంలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడు. సాయమందించమని వారి బంధువులు ఫోన్‌లో విజయనగరం యూత్‌ ఫేస్‌ బుక్‌ ఫేజ్‌ అడ్మిన్‌ షేక్‌ ఇల్తమాష్‌, ఆంబులెన్స్‌ శివ సంప్రదించడంతో వారు స్పందించారు. అలాగే పూసపాటిరేగ కనిమెల్ల నుంచి కూడా వేరేవారు ఫోన్‌ చేయగా, సోమవారం ఈ రెండు ప్రదేశాల్లో మరణించిన కరోనా మృతుల పార్దీవ దేహలకు విజయనగరం యూత్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌ తరుఫున దహన సంస్కారం నిర్వహించారు. అయితే కుటుంబీకులెవరూ అంతిమ యాత్రకు రావడానికి ఇష్టపడకపోవడంతో విజయనగరం యూత్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌ అడ్మిన్‌ షేక్‌ ఇల్తమాష్‌, అంబులెన్స్‌ శివ వారి సొంత ఖర్చులతో విజయనగరం పట్టణంలోని దాసన్నపేట శ్మశాన వాటికలో ఈ అంత్యక్రియలు పూర్తి చేశారు.. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు కనీసం చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు వచ్చి వారి వంతు బాధ్యతను వారు నిర్వహించలని షేక్‌ ఇల్తమాష్‌ కోరుతున్నారు.