
ముంబయి : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ప్రతిపాదిత పత్రాన్ని ఈ నెల చివరాకరులో సెబీకి సమర్పించే అవకాశాలున్నాయని సమాచారం. దీనికి సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తలు తెలిపారని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఎల్ఐసిని రూ.90వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐపిఒగా మార్కెట్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. మార్చి మధ్య నాటికి ఐపిఒకు కానుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.7 లక్షల కోట్ల విలువ చేసే డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడానికి కేంద్రం ఎల్ఐసిని ముందుకు తెచ్చింది.