Nov 29,2021 22:18

డిఈఓకు రిలే దీక్షల నోటీసులు అందిస్తున్న యుటిఎఫ్‌ నేతలు

డిసెంబర్‌ 6 నుండి డీఈఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు
చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల సమగ్ర సీనియారిటీ జాబితాను డీఎస్సీల వారీగా వారు సాధించిన మార్కులు ర్యాంకులతో సహా ప్రకటించాలని కోరుతూ డిసెంబర్‌ ఆరో తేదీ డీఈఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు చేపడతామని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జివి రమణ స్పష్టం చేశారు. ఈ మేరకు యూటీఎఫ్‌ నేతలు సోమవారం డిఈఓ పురుషోత్తంకు రిలే నిరాహార దీక్షలు నోటీసును అంద జేశారు. తమ పరిధిలో ఉన్న అంశాలను తప్పనిసరిగా పరిష్కారం చేస్తామని తెలుపుతూ.. డిఈఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతిరెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుకె. ముత్యాల రెడ్డి, జి.వి.రమణ, జిల్లా కార్యదర్శి శేఖర్‌, ఐక్య ఉపధ్యాయ కన్వీనర్‌ టి. దక్షిణామూర్తి మరియు పార్థసారథి ధర్నా నోటీసు ఇచ్చిన వారిలో ఉన్నారు.