Jan 13,2021 13:09

అమరావతి : ఎపిలో జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదునైన మారణాయుధాలతో తిరగడాన్ని నిషేధించింది. అయితే ఈ నిషేధం ఎపి మొత్తం వర్తించదు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఈ నిషేధం అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 16 నుంచి వరుసగా ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్తగా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మారణాయుధాలతో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.