Nov 21,2020 17:32

కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి మాస్కులు ధరించడం.. చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో చిన్న వాళ్ల దగ్గర నుంచి.. పెద్దవాళ్లదాకా.. అందరూ జాగ్రత్తగా ఉండడం కూడా అలవాటుగా మారింది. కరోనా వైరస్‌... దాని ప్రమాదం గురించి చిన్నారులకు ఏం తెలుస్తుంది చెప్పండి..? చెబితే విని.. అర్థం చేసుకునే వయసు అంతకన్నా కాదు. కరోనా మహమ్మారి నుండి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం పెద్దవాళ్ల బాధ్యత. కాగా, జాగ్రత్తలు సంగతి అటుంచితే.. వారికిష్టమైన ఐస్‌క్రీమ్‌లు.. లాలీపాప్‌లు.. చాక్లెట్లు ఎలా తింటారు.. జలుబులు, దగ్గులు వస్తాయని వాటిని కూడా తల్లిదండ్రులు దూరం చేస్తున్నారు. అయితే పిల్లలు మాత్రం వారికిష్టమైనవి తినడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో.. కొత్త కొత్త ఐడియాలతో వారు అనుకున్నది సాధిస్తారనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఓ బుడతడు లాలిపాప్‌ తినడానికి మాస్క్‌ బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకుంటాడు. ఎంచక్కా మాస్క్‌ని కూడా ధరిస్తాడు. ట్విట్టర్‌లో పోస్టు అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు బుడతడి ఐడియాను మెచ్చుకుంటున్నారు.