Jan 14,2022 21:31

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : 10వ తరగతి చదువుతున్న ఓ బాలికకు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన ఆటో డ్రైవర్ పై కిడ్నాపు , ఫోక్సో కేసులను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన యువకుడు యాళ్ల తేజదుర్గాప్రసాద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని రోజులుగా ఆమె వెంట పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 11న బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో తీసుకువెళ్లిపోయాడు. తాడేపల్లిగూడెం తీసుకువెళ్ళి... బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అక్కడ నుంచి తప్పించుకుని ఏలూరులోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు శుక్రవారం రాత్రి ఆటో డ్రైవర్ పై కిడ్నాప్, ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.